అభివృద్ధి, అవసరాలు, యోగ క్షేమాలు తీర్చడమే లక్ష్యం...ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు...

అభివృద్ధి, అవసరాలు, యోగ క్షేమాలు తీర్చడమే లక్ష్యం...ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు...

ప్రజా పాలనలో నియోజకవర్గ ప్రజలు....
అభివృద్ధి అవసరాలు, యోగ క్షేమాలు తీర్చడమే లక్ష్యం...
మెదక్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి..

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు...

Read More ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చాలి : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

మెదక్ సెప్టెంబర్ 12 (ప్రజా స్వరం)

Read More రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే : -రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులు 
కాజ్వేలు, చెరువులు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వతంగా చేపట్టే పనులపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో ఇతర అధికారులతో కలిసి శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజా పాలనలో నియోజకవర్గ ప్రజలు 
అభివృద్ధి అవసరాలు యోగక్షేమాలు తీర్చడమే లక్ష్యంగా  ముందుకు పోతున్నామన్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులు 10 కోట్లు ఉన్నాయని విపత్తు నిధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతి విపత్తుల నేపద్యంలో భారీ వర్షాలు వరదలతో జిల్లాలో పంచాయతీరాజ్ ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన రోడ్లు కల్వర్టులు, కాజు వేలు చెరువులు పెద్ద ఎత్తున నష్టం వాటిలిందని చెప్పారు. ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులతో తాత్కాలిక, శాశ్వత పనులు అంచనాలు సంబంధిత శాఖల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చూడాలని, అధికారులను ఆదేశించారు. అనంతరం మెదక్ సుందరీకరణ పై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,
మున్సిపల్ డి ఈ తో కలిసి చర్చించారు. మెదక్ పట్టణం సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, మెదక్ అన్ని జిల్లాల కంటే వినూత్నంగా ముందు వరుసలో ఉండాలని  ఐ లవ్ మెదక్ అనే నినాదంతో ఉండాలన్నారు. ఎంట్రన్స్ రోడ్డు లైటింగ్ మూడు చౌరస్తాలు సుందరీకరణ, బ్రాస్ మెటీరియల్ తో అంబేద్కర్ విగ్రహం తయారు చేయించాలని, మెదక్ చర్చిలో సెంట్రల్ లైటింగ్ ఇంటర్నల్ సిసి రోడ్స్ సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ సర్దార్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, ఇరిగేషన్ ఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య ప్రణాళికా అధికారి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం