కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
-విద్యార్థులు సాధించిన విజయాలు ముత్తారం మండలానికే గర్వకారణం.
-మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి.
ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం):
కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ముత్తారం (మంథని)మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు తమ ప్రతిభను చాటుకొని రెండు రజత పతకాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో దక్షిణ భారత రాష్ట్రాల నుండి వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు.కఠినమైన పోటీలో 7వ తరగతి విద్యార్థిని అండర్ 12 కేటగిరీ లో కే.సహస్ర మరియు అండర్ 14 కేటగిరీ లో 9వ తరగతి విద్యార్థిని బి.సహస్ర తమ పట్టుదల,క్రీడాస్ఫూర్తి,నైపుణ్యంతో రాణించి రెండు రజత పతకాలు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డా.సంతోష్ కుమార్ కేసరి మాట్లాడుతూ విద్యార్థినులు సాధించిన ఈ విజయాలు పాఠశాలకే కాకుండా ముత్తారం మండలానికి గర్వకారణమన్నారు.ఉపాధ్యాయుల కృషి,తల్లిదండ్రుల ప్రోత్సాహం,విద్యార్థినుల శ్రమ వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు.భవిష్యత్తులో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించడం మా ఆశయం అని ఈ విజయానికి శివాని మాస్టర్ పిల్లలను ప్రతి రోజు ట్రైన్ చేశారని తెలిపారు.స్కూల్ పిల్లలకు సమ్మయ్య మాస్టర్,ఇ.శ్రీనివాస్ మాస్టర్ ప్రోత్సహించారని ముత్తారం మండల విద్యాధికారి హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.ఈ విజయంపై ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సహస్రలకు శుభాకాంక్షలు తెలిపారు