విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

 

వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం.

Read More హరీష్ రావును పరామర్శించిన మాజీ డిజిపి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆ అమ్మవారు ప్రజలందరినీ చక్కగా చూడాలని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ విగ్రహాలను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తున్న గ్రామస్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి గ్రామంలో బొడ్రాయిని కూడా సీతాలమ్మ తల్లి అని పూజిస్తాం అని చెప్పారు.భారత సాంప్రదాయం చాలా గొప్పదిని, స్త్రీలను గౌరవించడం మాత్రమే కాదు వారే దేవతలుగా పూజించుకుంటాం అన్నారు. మైసమ్మ, ముత్యాలమ్మ, సీతలమ్మ అందరూ తల్లులే మనలని కాపాడుతారాని చెప్పారు.భుమిని కూడా భూతల్లిగా పూజిస్తాము.అమ్మవారి అనుగ్రహం మనందరి మీదా ఉండాలని కోరుకుంటున్నారాని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు శ్రీకాంత్, శంకర్ గౌడ్, యాదగిరి, రాజు, గ్రామస్థులు జంగం రాజు,జంగం యాదగిరి,నర్సింళ్లు, కాస మహిపాల్, కాస బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Read More రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి