క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
ప్రజల నుంచి 77 దరఖాస్తుల స్వీకరణ....
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ నవంబర్ 03 (ప్రజా స్వరం)
ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే, క్షేత్రస్థాయి లో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ప్రజల నుంచి 77 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భూభారతి 36, ఇందిరమ్మ ఇండ్లు 7, పెన్షన్లు 7, ఇతర 27 దరఖాస్తులను రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు బాధ్యత తీసుకుని ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో పెట్టకుండా ప్రతీ దరఖాస్తుకు సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు, భూ, పింఛన్ల, విద్య, వైద్యం వంటివి సమగ్రమైన పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు కారణాలు, నియమాలు వివరాలతో అర్జీదారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


