వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

 


సిద్దిపేట, నవంబర్ 3 (ప్రజాస్వరం) : 

Read More రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష

జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి లో లెవెల్ వంతెనలు, కల్వర్టులు, రోడ్ల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అదేవిధంగా అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీలో వివిధ నిర్మాణాల మరమ్మత్తుల కొరకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ధాన్యం కోసిన వెంటనే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిర్ణీత తేమశాతం వచ్చేవరకు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుతున్నారని కానీ అకాల వర్షాలు సంభవించినప్పుడు ఆ ధాన్యం తడిసిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ధాన్యం కోసం వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రాకుండా నిర్ణీత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయ మరియు ఇతర అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More 6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం        

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి