ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి

 

కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  

Read More రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖలను ఆదేశించారు.తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

Read More మెదక్ లో ఘనంగా పటేల్ జయంతి వేడుకలు

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి