మెదక్ లో ఘనంగా పటేల్ జయంతి వేడుకలు

మెదక్ లో ఘనంగా పటేల్ జయంతి వేడుకలు

పటేల్ ఆశయాల సాధన కృషి చేయాలి....
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు....

మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం)

Read More ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి పురస్కరించుకొని శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో  పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు నుండి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత ను ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో రజాకార్ల పై యుద్ధం ప్రకటించి, రజాకార్లను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టి, తెలంగాణకు నిజమైన స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర ను ప్రపంచానికి తెలియాలనే ఆలోచన తో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో 150 అడుగుల వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారని పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములు, సుభాస్ గౌడ్, జనగామ ప్రబారి నందా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రాజేందర్ జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్, మండల అధ్యక్షులు బెండే వీణ, జిల్లా మండల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి