6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం        

   బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. రాంచందర్ రావు

6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం        


గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పై బిజెపి  చార్జ్‌షీట్”ను విడుదల

హైదరాబాద్ నవంబర్ 1 9 (ప్రజాస్వరం)  : 
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తవుతున్న సందర్భంలో, ఆ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను బహిర్గతం చేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. రాంచందర్ రావు   “కాంగ్రెస్ వైఫల్యాలపై చార్జ్‌షీట్”ను విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు విడుదల చేసిన 60 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు, 13 ముఖ్య వాగ్దానాలు, అలాగే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఈ రోజు 100 రోజులు కాదు, దాదాపు 1000 రోజులు గడుస్తున్నా, ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. తెలంగాణ పేదల మీద కాంగ్రెస్ పెట్టిన ఈ హస్తం నిజానికి అభయ హస్తం కాదు – భస్మాసుర హస్తం.ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈ చార్జ్‌షీట్ రూపంలో రాష్ట్ర బిజెపి ప్రజల ముందుకు తీసుకువస్తోంది.ఈ సమావేశంలో బిజెఎల్పీ నాయకుడు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి  , చేవెళ్ల ఎంపీ   కొండా విశ్వేశ్వర్ రెడ్డి  , మెదక్ ఎంపీ  రఘునందన్ రావు  , ఆదిలాబాద్ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గౌతమ్ రావు  , బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు   లక్ష్మీ బసవ నరసయ్య , పార్టీ సీనియర్ నాయకులు   ప్రకాశ్ రెడ్డి  ,   సంగప్ప , దిలీప్ ఆచారి  , తదితర నాయకులు పాల్గొన్నారు.

Read More సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి