సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...
బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు.....
By Prajaswaram
On
మెదక్ నవంబర్ 02 (ప్రజా స్వరం)
జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ ని సైనికులను అవమానించిన
వ్యాఖ్యలను నిరసనగా మెదక్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను బీజేపీ నాయకులు దగ్ధం కార్యక్రమం కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దగ్దం చేసే తరుణంలో బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్ది సేపు పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఈర్ల రంజిత్ రెడ్డి, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, రామాయంపేట మండలం అధ్యక్షుడు నవీన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సీనియర్ నాయకులు సత్యం, సన్నీ, రాహుల్, బంటి, బబ్లు, ప్రేమ్ కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే
Related Posts
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


