స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి   :   బీసీ జేఏసిచైర్మన్ కృష్ణయ్య పిలుపు

స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి   :   బీసీ జేఏసిచైర్మన్ కృష్ణయ్య పిలుపు

 

హైదరాబాద్ నవంబర్ 3 (ప్రజాస్వరం) : 

Read More  చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై భారీ ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు, బి.సి జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. 76 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత కూడా మెజారిటీ ప్రజలైన బీసీలకు న్యాయం జరగడం లేదు. రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారు. మెజారిటీ ప్రజలు 56% జనాభా గల బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేకపోవడం దుర్మార్గం. ఇన్నాళ్లు బీసీలను నిర్లక్ష్యం చేశారు. అన్యాయం చేస్తున్నారన్న బీసీలు అనేక పోరాటాలు చేసి బీసీలను 42 శాతం సాధిస్తే రెడ్డి జాగృతి వారు కోర్టులలో కేసులు వేసి ఆపవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈనెల 18న జరిగిన బంద్ తో నైనా ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలు కళ్ళు తెరవాలని, బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలలో చైతన్యం వచ్చింది. పోరాట ప్రతిభ పెరిగింది. ఇప్పుడు సాధించకపోతే ఇంకా ఎప్పుడు సాధించమని హెచ్చరించారు.జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయముకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జరిగిన బీసీ విద్యార్థుల రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ “బంద్” కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అదే విధంగా రాజ్యాంగ సవరణకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. దీనికి రాజ్యాంగ బద్దత కల్పించడమే శాశ్వత పరిష్కారమన్నారు.స్థానిక సంస్థల రిజర్వేషన్లు విషయంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. కానీ ఆ రాష్ట్రాలలో బీసీలు తిరగబడలేదు. కానీ మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బంద్ జరపడం గర్వించదగిందని అన్నారు. ఇది మన రాష్ట్రంలోని బీసీల చైతన్యానికి ప్రతీక అన్నారు .ఇప్పుడు స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధ, చట్టబద్ధత, న్యాయబద్ధత ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D-6 ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లు చట్టం చేశారు. జనాభా లెక్కలు తీసి న్యాయ బద్ధం చేశారు. గతంలో సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పులలో. జనాభా లెక్కలు ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచవచ్చని తీర్పు చెప్పారు. అన్ని కోణాలలో పెంపుదలకు మద్దతు ఉంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది కావున అసెంబ్లీ చట్టం చేశారు జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు. ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టుకు ఏ కోర్టుకు ఎవరైనా వెళ్లిన బీసీల, కేసులు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి అసెంబ్లీ చట్టం చేశారు అలాగే సుప్రీంకోర్టు అగ్ర కులకు 10శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. పైగా ఇందిరా సహానీ కేసులో ఎంపరికల్ డాటా ఉంటే 50% సీలింగ్ ను అధిగమించవచ్చునని సుప్రీం కోర్టు అభిప్రాయం కూడా ఉన్నది. ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. చట్ట ప్రకారము, న్యాయప్రకారము రాజ్యాంగఫరమైన అవరోధాలు లేవు కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన - చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు కేసు బలంగాయుంది. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారన్నారు.స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేయాలని పిలుపునిచ్చాడు. అన్ని జిల్లాలలో, నియోజకవర్గ కేంద్రాలలో బీసీ సంఘాలు, కుల సంఘాలు ప్రజాసంఘాలతో సమావేశం జరిపి కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చాడు. అన్ని పట్టణాల, జిల్లాలల, మండలాల కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Read More స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి