ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్

 

నాగర్ కర్నూలు , నవంబర్ 3 (ప్రజాస్వరం ) : 

Read More హరీష్ రావును పరామర్శించిన మాజీ డిజిపి

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ పనులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి  సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ -1 (ఔట్ లెట్ సీ- పాయింట్) వద్ద హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే కోసం హెలికాప్టర్లో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతన ట్రాన్స్మిటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి టన్నెల్ ప్రాంతంలో 800-1000 మీటర్ల లోతులో షియర్ జోన్ (రాతి) అలాగే నీటి ప్రవాహాలు, వాటి తీవ్రతను గుర్తించడానికి ఈ సర్వేను ఉపయోగపడుతుంది.  సర్వే చేపట్టే విధానంపై శాస్త్రవేత్తలు వివరించిన అనంతరం ముఖ్యమంత్రి  సర్వే నిర్వహణకు హెలికాప్టర్ టేక్ఆఫ్ కోసం అనుమతించారు. ఆ హెలికాప్టర్ వెంట ముఖ్యమంత్రి,  మంత్రులతో కలిసి మరో హెలికాప్టర్లో కొంత దూరం ప్రయాణించి లోలెవల్లో జరిగే ఎక్సర్సైజ్ను పరిశీలించారు.సర్వే చేసే ప్రాంతం, సర్వే కోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్,  శాస్త్రవేత్త డాక్టర్ హెచ్వీఎస్ సత్యనారాయణ,  నీటి పారుదల శాఖ సలహాదారు, భారత సైనిక అధికారి పరీక్షిత్  వివరించారు.  కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, , నేనావత్ బాలు నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి