మెదక్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ధన-మాన-ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ కృషి....
సుమారు 300 మంది 2 కె రన్....
మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం)
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకొని శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మెదక్ లో ఉదయం నిర్వహించిన 2 కె రన్ లో స్థానిక యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పరుగు కార్యక్రమాన్ని మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ బోధన్ చౌరస్తా నుండి ప్రారంభమై పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ధన-మాన-ప్రాణ రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, యువత, అధికారులు, పోలీస్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, మహేష్, రాజా శేఖర్ రెడ్డి, జార్జ్, శైలందర్, ఎస్ఐ లు సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.


