ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి
దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివి.....
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి
మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం)
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాణించిన ఇందిరా గాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. పరిపాలన లో ఇందిరమ్మ చూపిన తెగువ దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనీయమన్నారు. తలలు పండిన రాజకీయ నాయకుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన గొప్ప మహిళా నేత ఇందిరమ్మ అని కొనియాడారు. ఇందిరమ్మ అంటేనే ఇండియా అనే విదంగా జనం హృదయాల్లో చోటు సంపాదించుకున్న భారతీయ వీర వనిత ఇందిరమ్మ అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి తో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ గూడూరి కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగ మోహన్ గౌడ్, బొజ్జ పవన్, శంకర్ గౌడ్, హరిత నర్సింగ్ రావ్, గోదల జ్యోతి, కృష్ణ, గాడి రమేష్, స్వరూప, సుఫీ తదితరులు పాల్గొన్నారు.


