మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు : కేటీఆర్
By Prajaswaram
On
హైదరాబాద్ ( ప్రజాసరం ) :
మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మళ్లీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలకు అర్థమైందని ఎక్కడ చూసినా ఇదే మాట రాష్ట్రవ్యాప్తంగా వినపడుతుందని అన్నారు హైదరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని మంత్రులు ఎమ్మెల్యేలు వారు వారే గొడవలు పడుతున్న విషయాలు రోజు ఒక్కటి బయటకు వస్తున్నాడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏ ఎమ్మెల్యే పార్టీ నుండి పోయిన వారి ఆస్తులు కాపాడుకోవడానికి పోతున్నారు తప్ప ప్రజల కోసం కాదని ఎవరు వెళ్లిన వారి స్థానంలో మరో ఎమ్మెల్యే గులాబీ జెండాతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


