చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలి : జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలి : జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల (ప్రజాస్వరం ) ;
దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమంది జీవనాధారంగా ఉన్న చేనేత దుస్తుల మరియు టెక్స్ టైల్ రంగంపై 12% నుంచి 18% జిస్టి వేయడం దారుణమని, చేనేత పై జిఎస్టి ఎత్తివేయాలని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...జీఎస్టీ లో విప్లవత్మకమైన మార్పులు తెచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పనులతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తు, ధనవంతులకు దోచిపెడుతున్నారని అన్నారు.
దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమంది జీవనాధారంగా ఉన్న చేనేత దుస్తుల మరియు టెక్స్ టైల్ రంగంపై 12% నుంచి 18% జిఎస్టి వేయడం దారుణమని అన్నారు.
చేనేత పై జిఎస్టి ఎత్తివేయాలని గత నెలలలోనే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో నేతన్న ల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలో ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.చేనేత మిత్ర పథకంతో ముడి సరుకులకు 50 సబ్సిడీ ఇవ్వడంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలకు భీమాలతో ధీమా ఇచ్చిందని అన్నారు.చేనేత వస్త్రాలపై 18 శాతం జీఎస్టీ వీధించి మేకిన్ ఇండియాకు బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచిందని అన్నారు.
చేనేత పై జిఎస్టి పెంపు ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధికి దూరం చేయడం మే కాకుండా వారసత్వంగా వస్తున్న మన సంస్కృతిని మసకబార్చడమే అని అన్నారు.ఇప్పటికైనా కేంద్రం చేనేత పై జిఎస్టి వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రావు, చింతల గంగాధర్, అనురాధ, ప్రణయ్, మనోజ్ తదితరులు ఉన్నారు.