పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.
-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.
-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12 వేల 168 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారి.
-ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డిపిఆర్ తయారీకి కృషి.
-ఎస్సీ వర్గీకరణ,బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి.
-పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లతో పలు అభివృద్ధి పనులు.
-తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పాల్గోన్న రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్.
పెద్దపల్లి,సెప్టెంబర్17(ప్రజా స్వరం):
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.బుధవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి,జాతీయ పతాకావిష్కరణ చేసారు.అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం గ్యారెంటీ పథకాలను ఒక్కోకటిగా అమలు చేస్తున్నామని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్ల, 500 రూపాయల గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాల అందరికీ పంపిణీ చేస్తున్నామని,మన జిల్లాలో నూతనంగా 12 వేల 168 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారి చేశామని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు.కాకతీయ కాలువ క్రింద ఉన్న 2 లక్షల 30 వేల ఆయకట్టు స్థిరీకరణ,10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగు నీరు అందించేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ ను 3 నుంచి 5 టిఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి డిపిఆర్ తయారు కోసం కోటి 10 లక్షల రూపాయల మంజూరు చేసామని అన్నారు.13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసి నీటి పారుదల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు.గోదావరిఖని జనరల్ ఆసుపత్రి 160 కోట్లతో నిర్మాణం జరుగుతుందని అన్నారు.జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సిసి రోడ్లు,సిసి డ్రైయిన్లు,బీ.టి రోడ్లు,స్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్,పురపాలక భవనం,డంప్ యార్డ్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.రాజీవ్ ఆరొగ్య శ్రీ కవరేజిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని,23 కోట్ల 75 లక్షలతో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి నందు 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్,26 కోట్లతో,51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి,22 కోట్లతో మంథని లో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు.ఎస్సీ వర్గీకరణ,బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. అన్నయ్య గౌడ్,అదనపు కలెక్టర్లు జె.అరుణశ్రీ,డి.వేణు,డి.సి.పి కరుణాకర్,ఆర్.డి.ఓ. బి.గంగయ్య,కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్,జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.