ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. 
బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు...
రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...
మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు...

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

Read More భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

మెదక్ సెప్టెంబర్ 13 (ప్రజా స్వరం)

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధుల యందు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. కౌడిపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా ‌పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల సిబ్బంది హాజరు పట్టికను, ఓపి రిజిస్టర్, మందుల నిల్వ ల గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 48 గంటల్లో వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు 
భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన మేరకు స్వీయ రక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని,సూచించారు. గడిచిన 15 రోజుల నుంచి అడపాదడప భారీ వర్షాలు కురుస్తున్నాయని లో లైన్ కాజు వేలు కల్వర్టులు, వరద ప్రవాహం ఉన్న వాటిని ప్రజలు దాటేయత్నం చేయొద్దని, దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడే అవకాశం  ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. వర్షాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి 
ప్రజలకు సీజనల్ వ్యాధులు చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున  ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారిస్తూ నీరు నిలవకుండా చూసుకుంటూ ‌స్వీయ రక్షణ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలి :  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం