హస్టల్స్ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
హస్టల్స్ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-గురుకులాల నిర్వహణ పై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్.
పెద్దపల్లి,సెప్టెంబర్12(ప్రజా స్వరం):
జిల్లాలోని హస్టల్స్ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురుకులాల నిర్వహణ పై అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నమోదు చేసుకున్న విద్యార్థుల హాజరు పూర్తి స్థాయిలో ఉండేలా రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని అన్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు.రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.వాన కాలం నేపథ్యంలో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని,గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో బీసి అభివృద్ధి అధికారి రంగారెడ్డి,ఎస్సి అభివృద్ధి అధికారి వినోద్ కుమార్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.