ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగాధరి దుబ్బయ్య గౌడ్.
-ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
అంతర్గాం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం):
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన 1988-89 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థి గంగాధరి దుబ్బయ్య గౌడ్ రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోగా తన తోటి క్లాస్ మేట్స్ వారి కుటుంబాన్ని పరామర్శించి 20500 రూపాయలను నగదు ఆర్థిక సహాయం అందజేశారు.తనతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి జరిగిన సంఘటన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి చేదోడు వాదోడుగా మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పూదరి సత్తయ్య గౌడ్,తాటిపెళ్లి కృష్ణమూర్తి,గుంట లక్ష్మణ్,ఎలుగల సత్తయ్య,ఉప్పులేటి నరసయ్య,గరిమెళ్ళ సురేష్,దుర్గం రాములు,ఇండిపెల్లి రవీందర్ లు పాల్గొన్నారు.ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులకు దుబ్బయ్య గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.