యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.
-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్.
-యూరియా సరఫరా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఏలా అమలు చేస్తుందని ఆగ్రహం.
పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం):
తెలంగాణలో యూరియా కొరత, రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం పెద్దపల్లిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు 6.12లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించినట్లు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంవద్ద 1.76లక్షల యూరియా నిల్వలు ఉన్నాయని,అయినా యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.రైతులకు యూరియా సరిగా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సైతం యూరియా అడిగిన రైతులకు బేడీలు వేసి జైళ్ళకు పంపించిన ఘనతను మూటగట్టుకుందని గుర్తు చేశారు.రైతుల కన్నీళ్ళతో కాలం వెళ్ళదీస్తున్న ఇరుపార్టీలకు ప్రజలు తగిన గుణపాటం చెప్తారని హెచ్చరించారు.ఇప్పటికైన ప్రభుత్వం మేల్కొని రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్,జిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్,బొడ్డుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.