స్వదేశీ వస్తువుల వాడకాన్ని అలవర్చుకోవాలి : ఎంపీ రఘునందన్ రావు
అంత్యోదయే లక్ష్యంగా మోడీ పాలన...
వేరే దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నవ్వడానికి నాయకత్వ లోపమే కరణం...
జీఎస్టీ స్లాబ్ తగ్గింపు తో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు...
స్వదేశీ వస్తువుల అమ్మకాన్ని ప్రోత్సహించండి...
- ఎంపీ రఘునందన్ రావు...
మెదక్ సెప్టెంబర్ 11 (ప్రజా స్వరం)
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రం జీకేఆర్ గార్డెన్స్ లో జీఎస్టీ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు. 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇచ్చిన ఘనత కూడా ఆయనదే అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను అంత్యోదయం వైపు తీసుకెళ్తున్నారు అన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాల్లో 25 కోట్ల ప్రజలను దారిద్రరేఖకు దిగువగా ఉన్న వారిని దారిద్రరేఖ పైకి తీసుకువచ్చారని, ఇదే అంత్యోదయానికి మేం చేసిన పరిష్కారమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జిఎస్టి స్లాబుల తగ్గింపు పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుందని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు 3 వేల నుండి 4 వేల వరకు లాభం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 8 ఏళ్ల పాపాన్ని మోడీ కడుక్కున్నారన్నారు. భారతదేశ మౌనమే ప్రపంచ దేశాలకు సమాధానం చెబుతుందని అంటూ ట్రంప్ ను ఎదిరించి నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుకుంటానని నరేంద్ర మోడీ వేసిన అడుగులే స్వదేశీ వైపు వేసే అడుగులని అన్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ దుకాణాల్లో స్వదేశీ వస్తువులను అమ్మబడును అనే బోర్డును పెట్టాలని కోరారు. విదేశీ వస్తువులను వాడడం వల్ల మనదేశంలోని కులవృత్తులన్నీ కూడా కనుమరుగై పోతున్నాయని అన్నారు. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదవారికి జీఎస్టీ తగ్గించడం వల్ల 15 వేల వరకు ఆదావుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, మండల అధ్యక్షరాలు బెండ వీణ, సంగీత నాయకులు తదితరులు పాల్గొన్నారు.