జిల్లా వ్యాప్తంగా 4,987 కేసుల పరిష్కారం..
రాజమార్గమే రాజమార్గం...
జిల్లా వ్యాప్తంగా 4,987 అన్ని రకాల కేసుల పరిష్కారం..
మొత్తం కేసుల్లో 1,04,88,964 రికవరీ....
మెదక్ సెప్టెంబర్ 13 (ప్రజా స్వరం)
రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం ఏడు బెంచ్ లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ మాట్లాడుతూ రాజీ పడడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 4,987 అన్ని రకాల కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 1,04,88,964 రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.ఎం సుభవల్లి, సీనియర్ సివిల్ జడ్జ్ రుబీనా ఫాతిమా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్, మార్నింగ్ కోర్ట్ జడ్జెస్ సిద్దయ్య, స్వాతి, బార్ ప్రెసిడెంట్ ఎం. రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, న్యాయవాదులు, అన్ని కోర్టుల సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.