రెండేళ్ల కూతురినీ చంపిన తల్లి
రెండేళ్ల కూతురినీ చంపిన తల్లి
తల్లి సహా ప్రియుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
తూప్రాన్,సెప్టెంబర్13,ప్రజాస్వరం ..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్నా కూతురిని ప్రియుడితో కలిసి చంపిన ఘటనలో తల్లి తో పాటు ప్రియుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.వివరాలు శబాషపల్లి గ్రామానికి చెందిన కోట్ల రాజు తన కుమార్తె మమత కు ఐదేళ్ల క్రితం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కర్ కి ఇచ్చి వివాహం చేశారు. వారికి కొడుకు ,కూతురు తనుశ్రీ – 2 సంవత్సరాలు) సంతానం ఉన్నారు. మమత మే నెలలో తన పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. మే నెల 21వ తారీకు మధ్యాహ్నం అందజా మూడు గంటల సమయంలో మమత కొడుకు చరణ్ ను తల్లిగారి ఇంటి వద్దనే ఉంచి కూతురు తనశ్విని తీసుకొని అత్తగారింటికి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. అల్లుడు భాస్కర్ మమత ఇంకా మా ఇంటికి రాలేదని చెప్పగా కూతురు కు ఫోన్ చేస్తే కలవకపోయేసరికి చుట్టుపక్కల మరియు బంధువుల వద్ద వెతికిన ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో మమత తండ్రి శివంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా మమత గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కనపర్రు గ్రామంలో ఉంటున్నదని తెలుసుకొనీ పోలీస్ బృందం అక్కడకు వెళ్ళి మమత తో పాటు ఆమె ప్రియుడు షేక్ ఫయాజ్ పట్టుకొని విచారించగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఆమెతోపాటు ఉండాల్సిన కూతురూ ఎక్కడని ప్రశ్నించగా రాత్రి సమయంలో కూతురు తనుశ్రీ ఏడ్చుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమెను ఎలాగైనా చంపివేస్తేనే వివాహేతర సంబంధానికి అడ్డు తొలగి పోతుందని జూన్ 04 వ తేదీన నాడు రాత్రి సమయంలో కనపర్రు నుండి శభాష్ పల్లికి వచ్చి గ్రామ శివారులోని కొత్త కుంట క్రింద ఎవరు లేని సమయం లో తనుశ్రీ ని వారిద్దరూ కలిసి గొంతు పిసికి చంపివేసి కాలువ కట్టలో పతిపెట్టినట్లు ఒప్పుకున్నారన్నారు.వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కేసులో కీలక పాత్ర పోషించిన తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మహేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, గట్టేష్ లను తూప్రాన్ డిఎస్పి అభినందించారు.