లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ; మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వర్షపు నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలి
జిల్లా యంత్రాంగం ప్రజల రక్షణలో అందుబాటులో ఉంది...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ సెప్టెంబర్ 12 (ప్రజా స్వరం)
జిల్లా లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణం గోల్కొండ వీధి, గాంధీ నగర్ లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు చేరిన ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో లోతట్టు ప్రాంతాలలో అధిక వర్షాలు నేపథ్యంలో భారీ వరద నీరు వచ్చి చేరుతుందని పరిష్కార మార్గాలు అన్వేషించి తక్షణ సహాయక చర్యలపై దృష్టి సారిస్తున్నామన్నారు. మురికి కాలువలు చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. భారీ వర్షాలు నేపద్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కోరారు. మన జిల్లాలో కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు