తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం...
తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం...
మెదక్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం)
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయడం సంతోషకరమని బొద్దుల కృష్ణ అన్నారు. తైబజార్ రద్దు నేపథ్యంలో శనివారం మెదక్ పట్టణం మార్కెట్ లో రైతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తైబజార్ రద్దు సంతోషకరమని అన్నారు. రైతులు బాగుండాలనే మంచి లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారని ఎలాంటి మరెన్నో మంచి పనులు చేస్తూ ఆయన ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపారు. వరద వల్ల ఇబ్బందులు పడుతున్న దుప్ సింగ్ తండా వాసులకు నిత్యసర సరుకులు, కూరగాయలను అందించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రజల, రైతుల సమస్యలపై వెంటుండి మరి పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అన్నారు. మెదక్, రామాయంపేట తైబజార్ వసూళ్లు రద్దు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.