తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) :
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేసారు.వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్ లైబ్రరీ, వివిధ ఇన్‌స్టిట్యూట్స్ దగ్గర రాత్రిపగలు చదువుతూ, ఉద్యోగ అవకాశాల కోసం వేచి ఉన్నారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వక, ఏ విధమైన స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంభిస్తోందని అన్నారు. నిరుద్యోగులను రోడ్డుపైకి తీసుకువచ్చి, కఠినంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని .“35 వేలు, ఒక లక్షా ఉద్యోగాలు ఇచ్చాం” అని చెప్పడం మాత్రమేనాని నిజమైన లెక్కలు చూపడం లేదని .జాబ్ క్యాలెండర్ ప్రకారం, UPSC తరహా తెలంగాణ పబ్లిక్ కమిషన్ కూడా పరీక్షలు సమయానికి నిర్వహించాలని .నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగకముందే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.