డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని భారం....
13,500 వేతనాలను 10 వేలకు తగ్గించారు...
జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలి...
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం...
మెదక్ సెప్టెంబర్ 15 (ప్రజా స్వరం)
గిరిజన ఆశ్రమ పాఠశాలల, హాస్టల్లో పని చేస్తున్న డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారించాలని సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల తో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్లో పని చేస్తున్న డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారించాలని కోసం నిరవదిక సమ్మె సెప్టెంబర్ 12 నుంచి నిర్వహిస్తున్నారని, నేటికీ నాల్గవ రోజు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేకపోవడంతో నేడు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించండం జరిగిందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 13,500 వేతనాలను ఇచ్చేవారని జీవో నెంబర్ 64 తీసుకురావడం వల్ల వేతనాలను తగ్గించి 10 వేల రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధానం లేదని మెదక్ జిల్లాలో మాత్రమే ఈ విధానం కొనసాగుతుందన్నారు. కొత్త జీవో విధానం ప్రవేశ పెట్టడం ద్వారా జిల్లా అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మెనూ ప్రకారం భోజన వసతి లేదని, తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేపిస్తున్నా పరిస్థితి నెలకొందన్నారు. గురుకుల పాఠశాల, హాస్టల్ లో పని చేస్తున్న వర్కర్స్ కు పర్మినెంట్ చేసి టైమ్ స్కేల్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం ఉందని, అలా కాకుండా రాష్ట్రమంతా కూడా ఒకే విధానాన్ని అమలు చేయాలన్నారు. అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. మరణించిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు.