మాదంతా రైతు సంక్షేమ ఎజెండా : మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ /ఘట్కేసర్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) :
జెండాలు, పార్టీలు లేవు మాదంతా రైతు సంక్షేమ ఎజెండా అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.ఘట్కేసర్ లో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జెండాలు, పార్టీలు లేవు. మాదంతా రైతు సంక్షేమ ఎజెండా అని అన్ని పార్టీ నాయకులు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి శంకరప్ప గారిని అధ్యక్షులుగా పెట్టి మీరు జరుపుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానన్నారు.రైతులకు ఎప్పుడూ కూడా టెంట్ వేసుకోవాలి ధర్నా చేయాలి అనే భావన ఉండదు. పొలంలో పంటలు పండించుకుంటూ గౌరవంగా బతకాలనుకుంటారు.ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేయకపోతే... గుర్తు చేసే క్రమంలో రైతులు టెంట్ వేసి మైకు పెడితే అది పీకేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రిబాగుల తనం మంచిది కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. 9 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నది వాస్తవం మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపించాము అక్కడే పెండింగ్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేస్తే చెప్పారు.రైతులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, చీఫ్ సెక్రటరీ తెలియదు. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణమాఫీ చేసి ఘట్కేసర్, మేడ్చల్ రైతులు ఏం పాపం చేశారు.ఎప్పుడూ కూడా ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చినారు రాజ్యం బాగుపడదు. మేము డాంబికాలకు పోయే వాళ్ళం కాదు. ఈ పదవి మా అలంకారం కోసం రాలేదు. ప్రజల ఓట్లకు పుట్టిందే ఎంపీ పదవి. వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తాం దేనికోసమైనా కొట్లాడుతానన్నారు. నేను జిహెచ్ఎంసి మీటింగ్ కు వెళ్తే మీరు ఎంపీ కదా ఎందుకు వచ్చారు అని అడిగారు. నేను ఈ సభకు వచ్చి సమస్యలు ప్రస్తావిస్తే నాలుగు పైసలు వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంది అని వచ్చాను. ఆనాడు ముఖ్యమంత్రి అయిన మంత్రులైన ప్రజల సమస్యలు వినడానికి ఒక రెండు గంటల పాటు దర్వాజా తెరిచి ఏ సంఘం వారు వచ్చిన సమస్యలు తెలుసుకునేవారు. ఇప్పుడు గోడలు పెట్టుకుంటున్నారు మాది కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే, ఎంపీ ఉంటేనే పనిచేస్తాం అంటున్నారు. మీ తాత జాగీరా అని అడుగుతున్నాను...అవసరమైతే నేనే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరుతాను. మిమ్మల్ని అందరిని తీసుకువెళ్తాను. ఈ దీక్షలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా సంపూర్ణ మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుంది.ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , విక్రం రెడ్డి , బుద్ధి శ్రీనివాస్, రామిరెడ్డి, మహిపాల్ రెడ్డి, బసవరాజు, రామోజీ, లక్ష్మారెడ్డి, శోభ రైతులు తదితరులు పాల్గొన్నారు.