ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చాలి : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చాలి : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చాలి
యాత్రాదానంపై క్షేత్ర‌స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

హైదరాబాద్,  (ప్రజాస్వరం) : 

Read More ఉత్తమ సేవ చేసిన వారికే మంచి గుర్తింపు. -అవార్డు గ్రహీతకు మంథని మాజీ ఎమ్మెల్యే సన్మానం.

టీజీఎస్ఆర్టీసీ సేవ‌ల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని విలేజ్, కాలనీ బ‌స్ ఆఫీస‌ర్‌ల‌కు సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ సూచించారు. సామాజిక బాధ్య‌త‌గా వినూత్న ఆలోచ‌న‌తో ఇటీవ‌ల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్య‌త‌ను వివ‌రించడంతో పాటు పెళ్లిళ్లు, శుభ‌కార్యాల‌కు అద్దె బ‌స్సుల బుకింగ్, కార్గో సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న చెప్పారు.వ్య‌క్తుల ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథ‌లు, నిరాశ్ర‌యులైన వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల‌కు, పర్యాటక ప్రాంతాలకు, విహార‌యాత్ర‌ల‌కు యాత్ర‌దానంలో భాగంగా తీసుకెళ్లేందుకు డిపోల‌ వారిగా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని సూచించారు.  టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానం కార్య‌క్ర‌మానికి దాత‌లు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు.
హైద‌రాబాద్ బాగ్ లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళాభ‌వ‌న్‌లో శ‌నివారం  రాష్ట్ర‌స్థాయి విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల స‌మావేశం జ‌రిగింది.  డిపోన‌కు ముగ్గురు చొప్పున  విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్లు హాజ‌రైన ఈ స‌మావేశంలో.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి రీజియ‌న్ల వారీగా వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లను ఆయ‌న స్వీక‌రించారు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌లను  అడిగి తెలుసుకున్నారు.టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల ప‌నితీరును మొచ్చుకున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 21 వేల‌కు పైగా అద్దెకు బ‌స్సుల‌ను బుకింగ్ చేశార‌ని, ఇందులో ప్ర‌తి ఒక్కరి కృషి ఉంద‌ని అభినందించారు. రాబోయే రోజులు సంస్థ‌కు ఎంతో కీల‌క‌మ‌ని, బ‌తుక‌మ్మ‌, ద‌సరా, దీపావ‌ళి, క్రిస్మ‌స్ తో పాటు సంక్రాంతి పండుగ‌కు ఇదే స్పూర్తితో విధులు నిర్వ‌ర్తించాల‌ని సూచించారు.టీజీఎస్ఆర్టీసీ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన టూర్ ప్యాకేజీల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, త‌దిత‌ర టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు.ఉద్యోగుల కృషి, ప‌ట్టుద‌ల వ‌ల్ల సంస్థ ఉన్న‌త‌స్థాయిలో ఉంద‌ని, నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం, క్ర‌మశిక్ష‌ణ‌తో ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వ‌ర్తించ‌డం వ‌ల్లే ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు సంస్థ‌పై ఉంటున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Read More గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం,,,,,. స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం