కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం. -పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.
కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం.
-పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల.
మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్13(ప్రజా స్వరం):
సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ ఆదాలత్ లతో కక్షిదారులకు రాజీమార్గమని,రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు.శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.లోక్ అదాలత్ లో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతావరణముతో కలుసుకొని,కోపాలు,భావోద్వేగాలు లేకుండా,డబ్బులు,సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురికి సంతోషకరణమని,కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే,ఒక ప్రక్క కోర్టుకు,మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని,ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు సమయం దొరుకుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులకు,ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ లోక్ అదాలత్ లో మంథని కోర్టులో 271 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియరు సివిల్ జడ్జి వి.భవాని,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి న్యాయాదికారిణి అనురాధ,రెవెన్యూ డివిజనల్ అధికారి బి.సురేష్,గోదావరిఖని ఏసిపి మడత రమేష్,అసోసియేషన్ అధ్యక్షుడు హరి బాబు,తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు,కోర్టు సిబ్బంది,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.