ఖరీఫ్ సీజర్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి : జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

ఖరీఫ్ సీజర్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి : జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్ధం కావాలి.
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-కోనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన.
-ధాన్యం రవాణకు అవసరమైన వాహనాలను సన్నద్ధం చేయాలి.
-సన్నరకాల ధాన్యాన్ని గుర్తించి వాటిని ప్రత్యేకంగా కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు.
-ధాన్యం కొనుగోలు సన్నద్దత పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్.

పెద్దపల్లి,సెప్టెంబర్12(ప్రజా స్వరం)

Read More ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి పంట పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు సన్నద్దత పై అదనపు కలెక్టర్ బి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూపొందించుకున్న ప్రణాళిక,అందుబాటులో ఉన్న మౌలిక వసతులు,తదితర అంశాలను అధికారులు వివరించారు.ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ మాసం ఎంత ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారిగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్  అధికారులను ఆదేశించారు.ప్రస్తుత సీజన్ లో గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2389,సాధారణ రకం ధాన్యానికి 2369 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు,ప్యాడి క్లీనర్లు,వేయింగ్ యంత్రాలు,టార్ఫాలిన్ మొదలగు వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.ధాన్యం దిగుబడి ఆధారంగా అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ యంత్రాలను పరీక్షించాలని కలెక్టర్ తెలిపారు.కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చే షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ధాన్యం కొనుగోలు దగ్గరే ధాన్యం నాణ్యతను కట్టుదిట్టంగా పరిశీలించాలని,రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండడానికి వీలులేదని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్న రకాల ధాన్యాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి వ్యవసాయ విస్తరణ అధికారితో సమన్వయం చేసుకుంటూ గుర్తించాలని,వీటిని కోనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకంగా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు,విద్యుత్ సరఫరా,లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు వీలుగా అవసరమైన మేర వాహనాలు సన్నద్దం చేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కు సంబంధించిన నివేదిక సమర్పించాలని,దాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు.ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని,నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని,ఈ అంశం రైతులలో విస్తృతంగా వెళ్ళాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్,జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్,జిల్లా సహకార అధికారి శ్రీ మాల,జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్,అడిషనల్ డిఆర్డిఓ రవీందర్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం