కల్లు కంపౌండ్లలో భద్రతా చర్యలు తప్పనిసరి : ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్
కల్లు కంపౌండ్లలో భద్రతా చర్యలు తప్పనిసరి. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ స్పష్టమైన ఆదేశాలు
శామీర్ పేట సెప్టెంబర్ 12(ప్రజాస్వరం)శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ ఉమ్మడి శామీర్ పేట మండలంలోని కల్లు కంపౌండ్ నిర్వాహకులతో శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశంలో కల్లు కంపౌండ్లలో తీసుకోవలసిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రతి కంపౌండ్‌లో తప్పనిసరిగా సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేయాలని, చట్టానికి లోబడి సక్రమంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.
అదేవిధంగా, నిర్వాహకులకు ఒక నోటీసు జారీ చేసి, పై సూచనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రత కాపాడడంలో శామీర్ పేట పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తారని, ప్రజల సహకారంతో మరింత సురక్షిత వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్సైలు శశివర్ధన్ రెడ్డి, దశరథ్ పాల్గొన్నారు.