గ్రూప్‌ 1 పరీక్షలను వెంటనే రీకండక్ట్ చేయాలి ; జనతా పార్టీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, డా.బూర నర్సయ్య గౌడ్

గ్రూప్‌ 1 పరీక్షలను వెంటనే రీకండక్ట్ చేయాలి ;  జనతా పార్టీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, డా.బూర నర్సయ్య గౌడ్

* వెంటనే గ్రూప్‌ 1 పరీక్షలను రీకండక్ట్ చేయాలి
* నిరుద్యోగుల హక్కులను పట్టించుకోకపోతే, బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో * మిలియన్ మార్చ్ తరహాలో పోరాటం తప్పదు.
* రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పట్ల నిజమైన కొంతైన చిత్తశుద్ధి ఉంటే, UPSC విధానాన్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
* కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టేలా వ్యవహరిస్తున్నారు
* రాష్ట్ర ఉపాధ్యక్షులు, డా.బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్ సెప్టెంబర్ 12  (ప్రజాస్వరం ) :
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని,తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ వ్యవహారాన్ని వ్యాపార సంస్థగా మార్చిందని భారతీయ జనతా పార్టీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డా.బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్-1 అభ్యర్థులు అంటే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు అయ్యే అభ్యర్థులబని,సాధారణంగా, ఆల్ ఇండియా ఐఏఎస్/ఐపీఎస్ ఆఫీసర్లు అన్ని రాష్ట్రాలకూ పరిపాలనలో కోటా ప్రకారం నియమించబడతారన్నారు.కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నియామకాలు సరైన విధంగా జరగలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలనలో ఉన్నా, కేవలం ఒకే పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో కూడా పేపర్లు, ఎగ్జామినేషన్ సెంటర్లు కొంతమందికి వ్యాపారం మాదిరిగా విచ్చలవిడిగా అమ్ముకున్నారు.  అనేక చోట్ల అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దు చేయబడింది.పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో యువత, నిరుద్యోగుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.ఆ తర్వాత.. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఇయర్‌లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మోసం చేశారు. 22 నెలల కాంగ్రెస్ పాలన గడిచింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఉద్యోగం సాధించాలనే తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది.గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో అవకతవకలు జరగడం, ఎగ్జామినేషన్ సెంటర్లు కొందరు కోచింగ్ సంస్థల చేత మేనేజ్ చేయడం,  కొన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసినవారికే ఒకేరకమైన మారులు, ఆపై ర్యాంకులు ఇవ్వడం, మాస్ కాపీయింగ్ మరియు మేనేజ్మెంట్ జరిగిన విధానాన్ని హైకోర్టు గుర్తించిందన్నారు. హైకోర్టు టీజీపీఎస్సీకి గ్రూప్‌ 1 పరీక్షను రీవాల్యూయేట్ చేయాలని లేదా మళ్లీ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.కానీ, దురదృష్టవశాత్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను రాజకీయ డైవర్షన్‌లుగా మార్చి, నిరుద్యోగుల సమస్యలు మరియు ఉద్యోగుల హక్కులను పట్టించుకోకుండా, వెంటనే ఎగ్జామ్ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.యావత్ తెలంగాణ నిరుద్యోగులు, గ్రూప్‌ 1 అభ్యర్థుల తరపున, వారి నమ్మకాలు, మనోభావాలకు అనుగుణంగా మా డిమాండ్ ఒకటే వెంటనే గ్రూప్‌ 1 పరీక్షలను రీకండక్ట్ చేయాలి.గ్రూప్-1 పరీక్షను పారదర్శకంగా రీ-ఎగ్జామ్‌ చేయాలని నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.నిరుద్యోగుల హక్కులను పట్టించుకోకపోతే, బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం.అదేవిధంగా, రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పట్ల నిజమైన కొంతైన చిత్తశుద్ధి ఉంటే, UPSC విధానాన్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి 90,000–1,00,000 ఉద్యోగాలను పూర్తిగా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా, ట్రాన్స్పరెంట్ గా భర్తీ చేసింది.అదే సమయంలో, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 650 గ్రూప్‌ 1 ఉద్యోగాలను ఇవ్వలేని దరిద్రపు పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టేలా వ్యవహరిస్తున్నారు.గత ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ అశోక్ నగర్ కు వచ్చిన నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు గుర్తుచేసేలా నిరుద్యోగ యువత బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.25వేల పెన్షన్ మంజూరు విషయం మర్చిపోయారా?ప్రతి ఉద్యమకారుడికి స్వాతంత్ర సమర్ధయోదులతో సమాన గుర్తింపు ఇస్తామని కూడా చెప్పిన మాట మర్చిపోయారా?తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెంటనే, ఫస్ట్ ఇయర్‌లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పోస్టుల భర్తీని కూడా హామీ చేసారు.ప్రతి జూన్ సెకండ్ నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని, UPSC తరహాలో TPSS ప్రారంభిస్తామని తెలిపారు.అదేవిధంగా, ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్‌లు మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.విద్యార్థి ఉపాధి అవకాశాలను పెంచడానికి ప్రతి నిరుద్యోగికి 10 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కాని ఇవన్నీ హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం ఈ హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. 6 నెలల్లోనే బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. కాని అమలుకు నోచుకోలేదు.బీసీ సంక్షేమానికి ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల కేటాయింపు, ప్రతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు ఫూలే సంక్షేమ భవనాలు, బీసీ విద్యార్థులకు ర్యాంక్‌తో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కాంట్రాక్టర్లుల్లో రిజర్వేషన్లు.. ఇవన్నీ హామీలు ఏమయ్యాయి?ఈ హామీలన్నీ నెరవేర్చకుండానే కామారెడ్డిలో విజయోత్సవాలు నిర్వహించాలనుకుంటే.. అవి నకిలీ ఉత్సవాలే. కాంగ్రెస్ చేసే ఉత్సవాలు.. బీసీ విద్రోహ దినోత్సవంగా బిజెపి పరిగణిస్తోంది.రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరి అనే అభియోగాలు పెడుతున్నారు. మొన్నటి దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలో కొంతమంది ఇండీ కూటమి ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి ఓటు వేయడం జరిగింది. అది కూడా ఈవీఎం కాకుండా,  బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటు వేసారు.వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఓట్లు వేసే సమయంలో, 10–15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ లైన్‌ని పక్కన పెట్టి ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ గారికి మద్దతు ఇచ్చారు. ఇది క్రాస్ ఓటింగ్ కాదు, దేశాభిమానం, మోదీ గారి నాయకత్వాం పట్ల విశ్వాసంతో వాళ్లు ఓటు వేస్తూ హిందూ సంస్కృతి, భారత భవిష్యత్తు కోసం నిలిచారని చెబుతున్నారు. పార్టీ వదిలిన ఇతర ఎమ్మెల్యేల వైఖరిని కూడా తెలంగాణ ప్రజలు గమనించి నవ్వుకుంటున్నారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ఎన్నికల్లో ప్రజలే తుది నిర్ణయం తీసుకోనివ్వండి.ఇదే కాక, గ్రూప్ వన్ రీ-ఎగ్జామ్స్ వెంటనే కండక్ట్ చేయాలి, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, యువతకు ఇచ్చిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఫాలో చేయాలి. ఇవి జరగకపోతే, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాం. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన సందర్భంగా సందర్భంగా... బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు గారికి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం