గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : మాజీ మంత్రి హరీష్ రావు
గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : మాజీ మంత్రి హరీష్ రావు
తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు.
రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు.
రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో కూర్చోబెట్టి హామీ ఇచ్చి మోసం చేసిండ్రు
నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తాం.
సిద్దిపేట, (ప్రజాస్వరం) :
సిద్దిపేటలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు.. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు అని అనుకుంటారు. తప్పులేదు అలా అనుకోవడంలో. కానీ జీవితంలో మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం. నా అనుభవంతో, 25 సంవత్సరాల ప్రజా జీవితంలో గమనించి చెబుతున్న మాట. జీవిత ప్రయాణంలో మొదటి అడుగు పడడమే చాలా ముఖ్యం.. మంచి అని వెయిట్ చేస్తే జీవితంలో లేజీనేస్ పెరిగిపోతుంది. సిద్దిపేట దాటి హైదరాబాదులో ఉద్యోగం చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. ఉద్యోగం కోసం మీరు ఊరుదాటి వెళితే మీకు ప్రపంచం అర్ధమవుతుంది. పోటీ ప్రపంచంలో నువ్వెక్కడున్నావు, ఎక్కడ నిలబడ్డావు, ముందుకు సాగాలంటే ఏం చేయాలనే విషయాలతో మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
కష్టం యొక్క విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది. ఉన్నత ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందో మీకు తెలవనిది కాదు.. గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఫలాన మంత్రులు, ఫలాన అధికారులు లంచం అడిగారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలి.
తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్ కి పోదామని చెప్పడం మూర్ఖత్వం. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండేళ్లు పూర్తకావస్తున్నాయి. 2 లక్షలు ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టి మాటిచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఏమైంది? ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కేసీఆర్. పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు. ఇంటర్వ్యూ నిర్వహించింది కేసీఆర్ గారు. కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా ఒక అంశాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ అని పారిపోయారు. జాబ్ క్యాలెండర్ కాదు అది జాబ్ లెస్ క్యాలెండర్.. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ సభలో చెప్పించారు.. నిరుద్యోగ యువతకు నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తామని. ఏమైంది.? ప్రభుతత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసింది. మీ పక్షాన మేము పోరాటం చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తాం. సిద్దిపేటలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళాతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. ఉద్యోగం పురుష లక్షణం అనేవారు పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయింది.. అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో ముందు సాగుతున్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలనే ఆశయాన్ని ఈ ప్రభుత్వం నిర్వేదం చేసింది. వెటర్నరీ కాలేజ్ ని సిద్దిపేటలో పెడితే రేవంత్ రెడ్డి కొడంగల్ కి తరలించిండు. సిద్దిపేటకు అన్యాయం చేసిండు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాము. 90% పని పూర్తయింది. ఆ చిన్న పనిని కూడా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్ లో ఎక్కువ వెళ్తుంది. రాజకీయాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీ భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు బాగుండాలని అన్నారు.