స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా.. సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్...
స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా..
సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్...
మెదక్ జూలై 16 (ప్రజా స్వరం)
స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికై ఉత్పత్తుల విక్రయ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక 100 రోజుల కార్యక్రమంలో భాగంగా, బుధవారం నర్సాపూర్ మునిసిపాలిటీ కార్యాలయము పరిధిలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడానికి మరియు పట్టణ పేదలకు ఆర్థిక అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎస్హెచ్జి మేళా ద్వారా స్వయం సహాయక సంఘాలు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, వారి పరిధిని విస్తరించడానికి, వారి సంస్థలను స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి, మేనేజర్ వి మధుసూదన్, మేప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, మేప్మా కోఆర్డినేటర్ దేవపాల, స్వయం సహాయక బృందాలు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.