అత్యవసరంగా విమానం ల్యాండింగ్
By Prajaswaram
On
హైదరాబాద్ (ప్రజాస్వరం) :
ఇవాళ మరో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది . దీంతో ప్రమాదం తప్పినట్లయింది. దేశంలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణం లో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత టెన్షన్ పెడుతుంది. ఈ రోజు ఉదయం 8.42కు పాట్నా నుంచి ఢిల్లీ కి బయలుదేరిన ఇండిగో విమానాన్ని(6E509) టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి డీకొట్టింది. దీంతో ఫ్లైట్ లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని పట్నాలోని జయప్రకాశ్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Latest News
11 Jul 2025 17:14:52
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదంహైదరాబాద్, (ప్రజాస్వరం) : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు సమాచారాన్ని ఆయనకు పంపించింది. దీంతో...