ట్రాలీ ఢీకొని బాలుడు మృతి
By Prajaswaram
On
ముత్తారంలో పండుగ పూట విషాదం.
-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.
ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి.
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


