పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ
పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
ఎన్నిక ల సమయంలో వికలాంగులకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ దారులకు పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడము రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగత్వంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురుచూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జూన్ నెల ఇవ్వాల్సిన పెన్షన్ జూలై 22 వచ్చిన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఏ తేదీన వేతనాలు తీసుకుంటున్నారు అదేవిధంగా వికలాంగులకు చేయూతదారులకు ఇవ్వాలి కదా అంటూ నిలదీశారు. రైతుబంధు ఇలాంటి పథకాలకు డబ్బులు ఉన్నప్పుడు పెన్షన్ దారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే 20 నెలలు గడిచిపోయిందని అన్నారు. ఆగస్టు మొదటి వారం లోపు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు ప్రకటించాలని లేనిపక్షంలో ఆగస్టు 13న ధర్నా ఉంటుందని హెచ్చరించారు. వికలాంగులకు నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి 15000 చొప్పున మానవతా దృక్పథంతో పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల ఉన్నచోట ప్రారంభమైన ఈ రాజకీయ రిజర్వేషన్లు అనంత ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో తెలంగాణలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.