ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలది : సీఎం రేవంత్ రెడ్డి
*ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలది : సీఎం రేవంత్ రెడ్డి శామీర్ పేట జూలై 15 (ప్రజా స్వరం) జీనోమ్ వ్యాలీలో ఉన్న (ఇచోర్ బయాలజిక్స్) బయోటెక్నాలజీ సంస్థ, ప్రాణాలను మెరుగుపరిచే, రక్షించే ప్లాస్మా-ఉత్పన్న చికిత్సలను తయారు చేయడానికి అభివృద్ధి పరచడానికి ఇచోర్ పునాది వేసిందని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శామీర్ పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ఇచోర్ బయాలజిక్స్) కొత్త యూనిట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి హాజరైనారు. శామీర్ పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ఇచోర్ బయోలాజిక్స్) కొత్త యూనిట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందని, దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్, బల్క్ డ్రగ్స్ లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలది ,ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయన్నారు. మా ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుందని, నూతన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుందని, వారికి అవసరమైన సహాకారాన్ని అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుంది మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించామని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ముందుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డిలు ముఖ్యమంత్రికి పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు.