కాచి చల్లారిన నీటిని త్రాగాలి : సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హేమావతి

కాచి చల్లారిన నీటిని త్రాగాలి  :  సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హేమావతి

చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా  తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్ కె.హేమావతి
 
చేర్యాల (ప్రజాస్వరం ) :  

చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హేమావతి  ఆకస్మిక తనిఖీ చేసారు. వైద్య సిబ్బంది మరియు వైద్యేతర సిబ్బంది హాట్ అటెండెన్స్ రిజిస్టర్ ను  పరిశీలించారు. మెడిసిన్ స్టాక్ రిజిస్టర్, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై  రిజిస్టర్ల నిర్వాహణ  సరిగ్గా  లేకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.డెంగ్యూ కేసులు ఎన్ని వచ్చినయ్, ఆస్పత్రిలో మందుల అందుబాటు, సిబ్బంది హాజరు అన్ని సక్రమంగా జరిగి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వర్షాకాలం వ్యాధులు వ్యాపించకుండా చూడాలని ఆదేశించారు. ప్రసవాల కోసం ఆసుపత్రికి వచ్చే వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దని, ఆస్పత్రిలో పరిశుద్ధ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని  ఆదేశించారు. అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి డాక్టర్ సరిగా చూస్తున్నారా లేదా అని తెలుసుకొని వర్షాకాలంలో త్రాగునీరు కలుషితమై వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి  ప్రతి ఒక్కరు వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని ఆస్పత్రికి వచ్చిన వారికి  సూచించారు.  వైద్యం కోసం వచ్చే రోగులకు వారికి ఏ వ్యాధి వచ్చింది. వ్యాధి రావడానికి కారణం ఏమిటో వివరించి వైద్యం చేయాలని వైద్యులకు సూచించారు. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని, కాచి చల్లారిన నీటిని త్రాగాలని, చేర్యాల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో  వైద్యులు అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు తప్పకుండా వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి భవనాన్ని  పరిశీలించి  ఆస్పత్రి నిర్మాణం పూర్తయినందున మెయిన్ రోడ్ నుండి ఆస్పత్రి వరకు అప్రోచ్ రోడ్డు, ఆస్పత్రి ఆవరణలో ఇంటర్నల్ రోడ్డు  నిర్మాణం చేపట్టి ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆసుపత్రిలోని పరికరాలను కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసి వైద్య సేవలు ఇక్కడ ప్రారంభించేలా  చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి డాక్టర్ ను మరియు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట  ఆస్పత్రి వైద్యులు దామోదర్, చేర్యాల తాసిల్దార్ దిలీప్ కుమార్,  మున్సిపల్ కమిషనర్  నాగేందర్లున్నారు. 

Read More ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు