ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం* (

 ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం*  (

ప్రజాస్వరం : మేడ్చల్:: మే 31 :

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో విష్ణు శౌర్య ఆధ్వర్యంలో వేద పండితులచే శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిం చారు. ఈ కళ్యాణ మహోత్సవం లో అధిక సంఖ్యలో దంప తులు పాల్గొని సంప్రదాయ పద్ధతిలో పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్స వానికి ముఖ్య అథితులుగా బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జి మహేందర్ రెడ్డిని,మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లతో  పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అథితులను విష్ణు శౌర్య శాలువలతో సన్మానించి సత్క రించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేసిన సందర్భంగా విష్ణు శౌర్య మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వ హించే కల్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భకు _లందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి వారి ఆశీ స్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.