త్వరలో మండలంలో పర్యటిస్తా..

ఇంచార్జ్ మంత్రి వివేక్ ...

త్వరలో మండలంలో పర్యటిస్తా..

మండల అభివృద్ధి కృషి చేయాలని విన్నవించిన మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ గౌడ్

 

ప్రజాస్వరం : నార్సింగి ,మే 31 :

 

నార్సింగి మండల అభివృద్ధి కి అవసరమైన మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి ను మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్ కోరారు. ఆదివారం గజ్వేల్ నుంచి ఇంద్రవెల్లి కి వెళ్తున్న సందర్భంగా జాతీయ రహదారి 44 పై నార్సింగి వద్ద మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, జూనియర్ కళాశాల, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నార్సింగి - శాలిపేట రహదారి పై రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేబడితే పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి పోతాయని వివరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు కూడా సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి దృష్టి కి తీసుకెళ్లారు. మండల అభివృద్ధి కి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని, ప్రతిపాదన లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే నార్సింగి మండలం లో పర్యటించి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని మంత్రి పేర్కొనడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు.