వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి .....

వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..

ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 :

 

నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతు ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచిచూస్తున్నప్పటికీ, సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఏ.ఓ లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. వడ దెబ్బ కారణం గా ఇద్దరు రైతులు అస్వస్థత కు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై అయన మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతం లో భారీ గా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల లో కూడా ధాన్యం సక్రమంగా దింపు కోవడం లేదని, దించిన చోట్లలో కిలో నుంచి కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై జిల్లా పౌర సరఫరా అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి పై ఉందని అన్నారు. రోడ్ల పై ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, పరిధితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రానున్న రెండు మూడు రోజులలో మొత్తం ధాన్యాన్ని తరలించక పోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ధాన్యం కొనుగోళ్ల పై ముందస్తు ప్రణాళిక తో పని చేసేవాళ్లమని, ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత, గోదాముల పరిస్థితి ఎలా ఉందో ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించు కోవడం లేదని, కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతి రాజు కుమారుడి తొట్టెల కార్యక్రమంలో పాల్గొని దీవించారు. పార్టీ సీనియర్ నాయకుడు తాటికొండ సిద్ధిరాములు కుమారుడి పుట్టు పంచాల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వధించారు. ఇంటర్మీడియట్ లో జిల్లా స్థాయి లో రెండవ ర్యాంకు సాధించిన అశ్మిత రాజ్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమ్మరి కిష్టయ్య భార్య సంవత్సరికంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్, భీం రావు పల్లి సర్పంచ్ కిష్ట జనార్ధన్, వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కందరి నవీన్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, పెద్ద తాండా మాజీ సర్పంచ్ ఛత్రియ నాయక్, పెద్ద తాండా అధ్యక్షుడు భాషా నాయక్, నాయకులు రాజశేఖర్, ఓంప్రకాష్ యాదవ్, వెంకటరాజు, సుదీప్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్... నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :   పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...
వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..
వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....
అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..
తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....
బేటి బచావో- బేటి పడవో నినాదంతో యువకుడి బైక్ యాత్ర...
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....