తూప్రాన్ ఆలయలో చోరీ ...
ఎసై గంగరాజు ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 31 :
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పెద్దమ్మ ఆలయం మరియు శ్రీ కుర్మా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగిన దొంగతనాల కేసు లో ఇద్దరు నిందితుల ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసై గంగరాజు తెలిపారు. చోరీ కేసులో నిందితులు కాలకంటి వెంకటేష్(35) మరియు మొహమ్మద్ షెరీఫ్(42), ఇద్దరూ తూప్రాన్ పట్టణానికి చెందిన వ్యక్తులను గుర్తించి ఆదివారం రోజు విచారణలో నిందితులు దేవాలయాలలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించగా, వారి వద్ద నుండి చోరీ చేసిన విగ్రహాలు, పూజా సామాగ్రి మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకూనట్లు ఎసై పేర్కొన్నారు.అనంతరం నిందితులను మెదక్ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.ప్రజలు తమ పరిసర ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తూప్రాన్ ఎసై గంగరాజు కోరారు.


