మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...

మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్...

మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...

ప్రజాస్వరం: మేడ్చల్: మే 18

మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ ధర్ బాబు ని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.అలాగే మేడ్చల్‌ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం దూర ప్రాంతంలో ఉండటం వల్ల సంఘటన స్థలానికి చేరుకోవడానికి గంట నుండి గంటన్నర సమయం పడుతోందని అప్పటికే భారీ నష్టం జరిగిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ అనేక ఇండస్ట్రీలు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు మరియు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయని,ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, విద్యార్థుల భద్రత, ఆస్తుల రక్షణ కోసం మేడ్చల్‌లో ప్రత్యేక అగ్నిమాపక కేంద్రం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ ఉపసర్పంచ్ బొక్క రఘుపతి రెడ్డి , కాంగ్రెస్ నాయకులు వై. నాగరాజు గౌడ్ , నాగార్జున్, ప్రశాంత్, వేణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....