అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : గజ్వెల్ / వర్గల్ ,మే 11 :
వర్గల్ మండలం గౌరారంలో నూతనంగా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు. అంబేడ్కర్ చిత్రపటం వద్ద విశేష పూజలు నిర్వహించి బి.ఆర్ అంబేడ్కర్ జ్ఞాపకతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం చాటుతుందన్నారు. ప్రపంచ శాంతి, దేశ అభివృద్ధికి గౌతమ బుద్ధుని బోధనలు, అంబేడ్కర్ ఆలోచన విధానాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అంబేడ్కర్ ఎంతో శ్రమించి ఉన్నత చదువులు చదివి అహర్నిశలు శ్రమించి బహుజనులకు సమాజంలో నీడను కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోర్క నర్సింలు, మంకి రామచంద్రం, బోర్కా చంద్రం, జుట్టు మలేష్, జుట్టు రాజు,బోర్కారాజు, మంకి.నర్సింలు,జుట్టు.ఎల్లం,జుట్టుమల్లయ్య, మంకి అశోక్ మంకి కనకరాజు, బోర్కా మహేష్ మరియు అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Latest News
11 May 2026 23:47:51
ప్రజాస్వరం : గజ్వెల్ / వర్గల్ ,మే 11 : వర్గల్ మండలం గౌరారంలో నూతనంగా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు. అంబేడ్కర్...


