ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ...

ఉప జిల్లా వైద్యధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్.....

ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ...

ప్రజాస్వరం : నార్సింగి ,మే 08 : 

 

మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిని ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అనుమతి పత్రాలు, ప్రసవాల సంఖ్య, రికార్డుల నిర్వహణ, శస్త్ర చికిత్స ద్వారా జరిగే ప్రసవాల పరిశీలనతో పాటు సంబంధిత నమోదు పత్రాలను తనిఖీ చేశారు. జనవరి నెల నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివరాలను పరిశీలించగా మొత్తం ఇరవై ఐదు ప్రసవాలు జరగగా అందులో ఐదు సాధారణ ప్రసవాలు, ఇరవై శస్త్ర చికిత్స ద్వారా జరిగినట్లు గుర్తించారు. అలాగే మొదటి ప్రసవాల్లో రెండు సాధారణ ప్రసవాలు, ఎనిమిది శస్త్ర చికిత్స ప్రసవాలు నమోదైనట్లు వెల్లడైంది. అవసరం లేని శస్త్ర చికిత్స ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీ బృందంలో భాల నర్సయ్య, శోభ, వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, రేణుక తదితరులు పాల్గొన్నారు.