జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు సహకరించండి...
ఈటల రాజేందర్ కు బిసి ఐక్యవేదిక నాయకుల వినతి .....
ప్రజాస్వరం : జవహర్ నగర్, మే 6 :
జవహర్ నగర్ లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జంట విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని బుధవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో జవహర్ నగర్ బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు సోమాచారి ఆధ్వర్యంలో ఐక్య వేదిక కార్యవర్గం కలిసి ఆయన కోరారు. స్పందించిన మల్కాజిగిరి ఎంపీ సభ్యులు ఈటెల రాజేందర్ సామాజిక విప్లవ పితామహుడు బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే, తొలి మహిళ టీచర్ సావిత్రిబాయి పూలేల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీసీ ఐక్యవేదికను అభినందించారు. విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి సమస్యలు తలెత్తిన వాటిని పరిష్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జవహర్ నగర్ బిజెపి పార్టీ అధ్యక్షులు కమలాకర్ చారి, బిసి ఐక్యవేదిక ఉపాధ్యక్షులు రమేష్ బాబు,చంద్ర కార్యదర్శులు,పాక దేవేందర్, ఏ రాజు యాదవ్,గాలయ చారి, నాగరాజుచారి,బుజ్జి, చంద్రశేఖర్ చారి,రామాచారి, హనుమంతు,మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


