కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి....

మార్కేట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కీర్తన విఠల్ రెడ్డి .....

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి....

ప్రజాస్వరం : తూప్రాన్‌, మే 6 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

కొనుగోలు కేంద్రాల్లోనే «ధాన్యం విక్రయించాలని మార్కేట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ కీర్తనరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో బాగంగా బుధవారం ఉమ్మడి మండలం తూప్రాన్, మనోహరాబాద్‌ మండలాల రైతులతో మార్కేట్‌ యార్డులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపొవద్ధని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మార్కేట్‌ కమిటీ పాలక వర్గంతో సమావేశం నిర్వహించారు. మార్కేట్‌ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు, పట్టణంలోని ఇంటిగ్రేటేడ్‌ మార్కేట్, టోల్‌ప్లాజా వద్ధ ఉన్న వే సైడ్‌ మార్కేట్‌ యార్డులను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కేట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ మామిండ్ల కృష్ణ, డైరేక్టర్లు లక్ష్మన్, నావబోత్ శ్రీనివాస్ గుప్త వెంకటేశం గుప్త దొడ్ల వెంకటేష్ సూసైటీ చైర్మన్ మెట్టు బాల కృష్ణ రెడ్డి పురం రవి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఈనెల 10న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి... ఈనెల 10న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 7 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    భారతీయ జనతా పార్టీ ఈనెల 10న సికింద్రాబాద్ ఫేరెట్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ...
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి....
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష....
తూప్రాన్ లో సూసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...... ..
ఐకేపీ కొనుగోలు కేంద్రలను పారశీలించిన తహసీల్దార్... 
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు సహకరించండి...
జ్యువేలర్ పాన్ బ్రోకర్ల యజమానులకు అవగహన...