ఐకేపీ కొనుగోలు కేంద్రలను పారశీలించిన తహసీల్దార్... 

ఐకేపీ కొనుగోలు కేంద్రలను పారశీలించిన తహసీల్దార్... 

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 6 : 

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లో ఇస్లాంపుర్ ఐకేపీ, గుండ్రేడపల్లి ఐకేపీ మరియు దాతర్ పల్లి ఐకేపీ కేంద్రాలలో తడిసిన వడ్ల ను తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతు.. కేంద్రంలో నిర్వహణ విధానాలను పరిశీలించి, వడ్ల నాణ్యత మరియు కొనుగోలు ప్రక్రియపై కేంద్రం ఇంచార్జ్ తో సమీక్ష నిర్వహించారు.తడిసిన వడ్లను సరైన విధంగా ఎండబెట్టిన తరువాత మాత్రమే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అలాగే వడ్లలో తేమ శాతం నియంత్రణలో ఉంచడం, నాణ్యత ప్రమాణాలను పాటించడం ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. తడిసిన వడ్లను నిర్లక్ష్యంగా నిల్వ చేయకుండా, సరైన రీతిలో ఎండబెట్టి నిల్వ చేయాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వడ్లను విక్రయించాల్సిందిగా రైతులకు అవగాహన కల్పించారు. కొనుగోలు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కార్యాలయం లో తెలియజేయవలసిందిగా తూప్రాన్ తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.

Latest News

ఈనెల 10న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి... ఈనెల 10న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 7 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    భారతీయ జనతా పార్టీ ఈనెల 10న సికింద్రాబాద్ ఫేరెట్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ...
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి....
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష....
తూప్రాన్ లో సూసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...... ..
ఐకేపీ కొనుగోలు కేంద్రలను పారశీలించిన తహసీల్దార్... 
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు సహకరించండి...
జ్యువేలర్ పాన్ బ్రోకర్ల యజమానులకు అవగహన...